క్షణక్షణం ఉత్కంఠ | Project Zed movie will be released in September. | Sakshi
Sakshi News home page

క్షణక్షణం ఉత్కంఠ

Aug 17 2017 12:24 AM | Updated on Sep 15 2019 12:38 PM

క్షణక్షణం ఉత్కంఠ - Sakshi

క్షణక్షణం ఉత్కంఠ

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా, హిందీ నటుడు జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రలో సీవీ కుమార్‌ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మాయావన్‌’.

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా, హిందీ నటుడు జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రలో సీవీ కుమార్‌ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మాయావన్‌’. ఈ సినిమాను ‘ప్రాజెక్ట్‌ జెడ్‌’ పేరుతో ఎస్‌.కె. బషీద్‌ సమర్పణలో ఎస్‌.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సెప్టెంబర్‌ తొలివారంలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ఆసక్తి తగ్గదు. సందీప్‌ కిషన్‌ నటన హైలైట్‌. లావణ్యా త్రిపాఠి ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, కెమెరా: గోపి అమర్నాథ్, డైలాగ్స్‌: శశాంక్‌ వెన్నెలకంటి.

Advertisement
 
Advertisement
Advertisement