యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ క్షేమం! | Prabhas safe | Sakshi
Sakshi News home page

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ క్షేమం!

Dec 1 2013 4:46 PM | Updated on Oct 3 2018 7:48 PM

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ క్షేమం! - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ క్షేమం!

కేరళలో బాహుబలి సినిమా షూటింగ్లో ఉన్న హీరో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్కు గాయాలయినట్లు వచ్చిన వార్తలు పుకారేనని తేలింది.

హైదరాబాద్: కేరళలో బాహుబలి సినిమా షూటింగ్లో ఉన్న హీరో  యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్కు గాయాలయినట్లు వచ్చిన వార్తలు పుకారేనని తేలింది. తనకు గాయాలేమీ తగలలేదని, తాను క్షేమంగానే ఉన్నానని ప్రభాస్ తన తన ఫేస్బుక్ ద్వారా అభిమానులకు తెలిపారు.

తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్మకత్వంలో రూపొందుతున్న  చిత్రం బాహుబలి. రాజమౌళి, ప్రభాస్ ఈ సినిమా కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోకు కావలసిన రీతిలో ప్రభాస్ తన శరీర ఆకృతిని రూపుదిద్దుకున్నారు.  ఈ సినిమాను దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ మిగిలిన సినిమాలలో కూడా నటించడంలేదు.  బాహుబలి కోసం ఈ రెబల్ స్టార్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. రెండువేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో షూటింగ్‌ జరుపుతున్నారు. దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ కేరళలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో యంగ్‌ రెబల్‌ ప్రభాస్ గాయపడ్డాడనే వార్తలు  నాలుగురోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ చిత్రం షెడ్యూల్‌ శరవేగంతో నడుస్తోంది. డిసెంబర్ 3న కేరళ షెడ్యూల్ పూర్తి కానుంది. దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే షూటింగులో ప్రభాస్ గాయపడ్డట్లు ఇటీవల సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాపించాయి.  ఆ వార్తల్లో నిజంలేదని ప్రభాస్ తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో అభిమానులకు సందేశం పంపారు. 'కేరళలో జరుగుతున్న బాహుబలి షూటింగులో తాను గాయపడ్డట్లు వార్తలు విన్నాను. అలాంటిదేమీ లేదు. నేను చాలా బాగున్నాను. షూటింగులో పాల్గొంటున్నాను' అంటూ ప్రభాస్ పోస్ట్‌ చేశాడు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ప్రభాస్‌పై వస్తున్న పుకార్లపై అభిమానులు కలవరపడుతున్నారు. అయితే ప్రభాస్‌ ఇచ్చిన మెసేజ్‌తో కొంతవరకు స్పష్టత వచ్చింది.   హైదరాబాద్‌లో త్వరలో జరిగే షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొంటాడని ఈ సినిమా యూనిట్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement