కొత్త ప్రయాణం | Prabhas first stepped up in the latest movie 'Soho' sets. | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

Aug 19 2017 12:15 AM | Updated on Oct 22 2018 8:06 PM

కొత్త ప్రయాణం - Sakshi

కొత్త ప్రయాణం

శ్రావణ శుక్రవారం... శుభ ముహూర్తం... ప్రభాస్‌ కొత్త ప్రయాణం మొదలైంది.

శ్రావణ శుక్రవారం... శుభ ముహూర్తం... ప్రభాస్‌ కొత్త ప్రయాణం మొదలైంది. నిన్ననే తాజా సినిమా ‘సాహో’ సెట్స్‌లో ప్రభాస్‌ ఫస్ట్‌ స్టెప్‌ వేశారు. సుజీత్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ షాట్‌ కంప్లీట్‌ చేశారు. ‘సాహో’ కొత్త టీమ్‌తో, కొత్త స్టోరీతో రూపొందు తోంది. కానీ, సెట్‌ వేసిన ప్లేస్‌ మాత్రం పాతదే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘బాహుబలి’ సెట్‌ వేసిన చోటే... ‘సాహో’ కోసం ఐదు కోట్ల రూపాయలతో సెట్‌ వేశారట. అందులో మొదలైన సెకండ్‌ షెడ్యూల్‌లో ప్రభాస్‌ పాల్గొంటున్నారు.

‘‘ఇట్స్‌ షూట్‌ టైమ్‌... సుమారు నాలుగున్నరేళ్ల ‘బాహుబలి’ ప్రయాణం తర్వాత, సరికొత్త యాక్షన్‌ ప్రపంచం ‘సాహో’లోకి అడుగులు వేయడానికి సంతోషిస్తున్నా’’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో బీ–టౌన్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారట! దావూద్‌ ఇబ్రహీం చెల్లెలు హాసీనా పార్కర్‌ జీవితకథ ఆధారం గా రూపొందిన హిందీ సినిమా ‘హసీనా’ కోసం కొంచెం బరువు పెరిగిన శ్రద్ధా ప్రస్తుతం ‘సాహో’ కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement