సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

Pooja Hegde To Act Opposite Suriya In Tamil Movie Aruva - Sakshi

‘అల వైకుంఠపురంలో’ సినిమా హిట్‌తో హీరోయిన్‌ పూజా హెగ్డే టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన ఆమెకు కోలీవుడ్‌ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో సూర్య, సింగం ఫేం డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న‘అరువా’ చిత్రంలో పూజను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. మొదటగా ఈ చిత్రానికి రష్మిక మందన్నను సంప్రదించగా.. కాల్షిట్లు సర్దుబాటు కాకపోవటంతో ఈ అవకాశం పూజను వరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

కాగా, ‘అరువా’ చిత్రాన్ని స్టూడియోగ్రీన్‌ సంస్థలో జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్‌ మూవీగా తెరకెక్కనుంది. డి.ఇమామ్‌ సంగీతం అందిచనున్నారు. ఇక జీవా హీరోగా 2012లో వచ్చిన ‘ముంగమూడి’ సినిమాతో పూజా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరి సూర్య సరసన ఛాన్స్‌ కొట్టేసి ఆమె ఏ మేరకు సక్సెస్‌ సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top