ప్లీజ్‌... అలాంటివి ఇక ఆపేయండి! | Please ... stop anymore | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌... అలాంటివి ఇక ఆపేయండి!

Apr 26 2017 11:49 PM | Updated on Sep 5 2017 9:46 AM

ప్లీజ్‌... అలాంటివి ఇక ఆపేయండి!

ప్లీజ్‌... అలాంటివి ఇక ఆపేయండి!

హీరోని వెంటాడి వెంటాడి ప్రేమించడం, అతనితో చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం, సునాయాసంగా డబుల్‌ మీనింగ్‌ డైలాగులు

హీరోని వెంటాడి వెంటాడి ప్రేమించడం, అతనితో చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం, సునాయాసంగా డబుల్‌ మీనింగ్‌ డైలాగులు మాట్లాడటం... హీరోయిన్ల క్యారెక్టర్లు ఇలా ఉండాల్సిందేనా? ఈ ప్రశ్న చాలామంది కథానాయికల్లో ఉంది. అయితే వచ్చిన అవకాశాలను వదులుకుంటే పెట్టే బేడా సర్దుకుని ఇంటి ముఖం పట్టాల్సిందే కదా. అందుకే మంచి పాత్రలు వచ్చినప్పుడు చేయడం, రానప్పుడు పైన చెప్పినట్లు ఓ మూస ధోరణిలో సాగే పాత్రలు చేయడం చాలామంది కథానాయికలకు అలవాటైంది. ఒకప్పుడు జ్యోతిక అలాంటి పాత్రలు చేసినప్పటికీ, వాటిలో హుందాగా ఉండే పాత్రలే ఎక్కువ.

‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ మొదలుపెట్టాక సబ్జెక్ట్స్‌ సెలక్షన్‌ విషయంలో ఆమె ఇంకా కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. హుందాగా ఉండే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. జ్యోతిక నటించిన తాజా చిత్రం ‘మగళిర్‌ మట్టుమ్‌’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో వేడుకలో హీరోయిన్లను హుందాగా చూపిస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ఇంకా జ్యోతిక మాట్లాడుతూ – ‘‘యువత మీద సినిమా ప్రభావం చాలా ఉంటుంది. ఒక సినిమాలో హీరో సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తే.. తమకూ ముగ్గురు నలుగురు గాళ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నా ఫర్వాలేదని అబ్బాయిలు అనుకునే అవకాశం ఉంది. అందుకే ఒక హీరోకి ఒక్క హీరోయిన్‌ చాలు. సెకండ్‌ హీరోయిన్‌ అవసరం లేదు. ఇది దర్శకులకు నేను ఇస్తున్న సలహా మాత్రమే. మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నించాలి.

దర్శకులందరికీ ఓ విన్నపం. దయచేసి హీరోయిన్లకు మంచి పాత్రలు ఇవ్వండి. మీ అమ్మ, భార్య, గాళ్‌ ఫ్రెండ్‌.. ఇలా మీ జీవితాల్లో కీలక పాత్రలు పోషించే మహిళల్లాంటి పాత్రలను ఇవ్వండి. మీరెలాగూ ‘ఫిజికల్‌’గా మంచి డ్రెస్సులు ఇవ్వరు. కనీసం అర్థవంతమైన పాత్రలిస్తే బాగుంటుంది. కమెడియన్స్‌ పక్కన నిలబడి, హీరోయిన్లు డబుల్‌ మీనింగ్‌ డైలాగులు చెప్పడం చూడ్డానికి బాగాలేదు. అలాగే, సిగ్గు లేకుండా హీరోల వెంటపడుతూ ప్రేమించమని అడిగే సీన్స్, నాసిరకం ఇంట్రడక్షన్‌ సీన్లు.. ప్లీజ్‌ అలాంటివి ఇక ఆపేయండి. ఎందుకంటే హీరోలకు పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. వాళ్ల డైలాగులను, హావభావాలను, కథానాయిక పాత్రలను కామన్‌ పీపుల్‌ అనుకరిస్తారు. అందుకే వాళ్లను దృష్టిలో పెట్టుకోవాలి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement