గోపాలుని పరిచయ గీతం | Pavan Kalyan's Intro Song on Shoot | Sakshi
Sakshi News home page

గోపాలుని పరిచయ గీతం

Oct 28 2014 10:44 PM | Updated on Mar 22 2019 5:33 PM

గోపాలుని పరిచయ గీతం - Sakshi

గోపాలుని పరిచయ గీతం

మసాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్‌కి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, పరిచయ గీతానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు అభిమానులు.

మసాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్‌కి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, పరిచయ గీతానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు అభిమానులు. ‘గోపాలా గోపాలా’ టీమ్ ప్రస్తుతం అదే పనిమీద ఉంది. ఇటీవలే హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌పై పవన్‌కల్యాణ్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకుడు కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ). ఇప్పుడు పరిచయ గీతం చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన లీడ్ సన్నివేశాన్ని మంగళవారం హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో సుచిత్రా చంద్రబోస్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ తదితరులు ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. ఈ పాట చిత్రీకరణలో పవన్‌కల్యాణ్ కూడా పాల్గొంటారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ సన్నాహాలు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement