నిషా అగర్వాల్ రీ ఎంట్రీ | Nisha Agarwal Re-entry | Sakshi
Sakshi News home page

నిషా అగర్వాల్ రీ ఎంట్రీ

May 17 2014 11:41 PM | Updated on Sep 18 2019 2:56 PM

నిషా అగర్వాల్ రీ ఎంట్రీ - Sakshi

నిషా అగర్వాల్ రీ ఎంట్రీ

వివాహా నంతరం హీరోయిన్‌గా రీ ఎంట్రీ అవడం అనేది నటీమణులకు అరుదైన విషయమే. అలాగే కోలీవుడ్‌లో పెళ్లి తరువాత ముఖానికి రంగేసుకుని విజయం సాధించిన వారి సంఖ్య తక్కువే.

వివాహా నంతరం హీరోయిన్‌గా రీ ఎంట్రీ అవడం అనేది నటీమణులకు అరుదైన విషయమే. అలాగే కోలీవుడ్‌లో పెళ్లి తరువాత ముఖానికి రంగేసుకుని విజయం సాధించిన వారి సంఖ్య తక్కువే. ఇలాంటి పరిస్థితిలో నటి నిషా అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈమె క్రేజీ హీరోయిన్ కాజ ల్ అగర్వాల్ చెల్లెలన్న విష యం తెలిసిందే. తమిళంలో ఇష్టం చిత్రం ద్వారా పరిచ యం అయిన ఈ భామ తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేశారు. అయితే హీరోయిన్‌గా కెరీర్ అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో ముంబ యికి చెందిన కరణ్ వలేచ్చా అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత ఏడాది జరిగింది.

అయితే ఏడాదికి వైవాహిక జీవితం బోర్ కొట్టడంతో తాజాగా మళ్లీ నటించడానికి వచ్చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పహాయ పహాయ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇకపై కంటిన్యూగా నటిస్తారా? అనే ప్రశ్నకు ఆ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బదులిచ్చారు. అయితే నిషా అగర్వాల్‌కు వైవాహిక జీవితంపై బోర్ కొట్టిందని ఇకపై వరుసగా చిత్రాల్లో నటిస్తారని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. నటి అమలాపాల్ కూడా మొదట వివాహానంతరం నటిస్తానని వెల్లడించి ఆ తరువాత ప్రియుడు విజయ్ కుటుంబం వ్యతిరేకించడంతో నటనకు స్వస్తి చెబుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement