నిఖిల్‌ మూవీ టైటిల్‌ మారనుందా?

Nikhil Movie Title May Changing - Sakshi

నిఖిల్‌ తాజాగా నటిస్తున్న సినిమా టైటిల్‌పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత నట్టి కుమార్‌, హీరో నిఖిల్‌ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ఈ సినిమా టైటిల్‌ మారనుందని తెలుస్తోంది. 

జగపతి బాబు హీరోగా ముద్ర అనే సినిమా కూడా రిలీజ్‌ కావడం.. ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నిఖిల్‌ను తన అభిమానులు ప్రశ్నించడం.. ఆ సమయంలో నిఖిల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై నిర్మాత నట్టికుమార్‌ సీరియస్‌ అవ్వడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం నిఖిల్‌ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను మార్చబోతున్నట్లు సమాచారం. కొత్త టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో హిట్‌ అయిన కణితన్‌కు రీమేకే ఈ చిత్రం. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. మార్చిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ ప్రయత్నిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top