ఒక్క సినిమా కూడా వదలట్లేదు..!

విభిన్న చిత్రాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం అమెరికాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న కిరాక్ పార్టీ లో నటిస్తున్న నిఖిల్, షూటింగ్‌కు గ్యాప్ రావటంతో ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు. అక్కడ ఈ యంగ్ హీరో రిలీజ్ అయిన ప్రతీ సినిమా చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇటీవల అజ్ఞాతవాసి సినిమా చూసిన నిఖిల్, ‘ ప్రస్తుతం న్యూజెర్సీ 8కె సినిమాస్‌లో.. రచ్చ ఎంట్రీ, పండుగ సమయం’ అంటూ ట్వీట్ చేశాడు. రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన బాలయ్య జై సింహా సినిమాను కూడా ఫిలడల్ఫియాలో ప్రీమియర్ షో చూశాడు నిఖిల్. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు ఈజ్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పండుగ రోజు రిలీజ్ అవుతున్న రంగుల రాట్నంపై నిఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
New Jersey 8k cinemas ... right now. Raccha entry... #PowerStarMass #Agnyathavasi
Celebration time 😁😀🤣😃😄 pic.twitter.com/MRQi6Ud9qn— Nikhil Siddhartha (@actor_Nikhil) 10 January 2018
East or West Balayya Babu is the Best... Watching #JaiSimha premiere show #Philadelphia pic.twitter.com/hA1za2I1hS
— Nikhil Siddhartha (@actor_Nikhil) 12 January 2018