మంచిర్యాలలో ‘ఎస్‌డీ కేరాఫ్‌ వెంచపల్లి’ షూటింగ్‌

New Movie Shooting In Mancherial - Sakshi

సాక్షి, కోటపల్లి(చెన్నూర్‌): సినిమా ప్రతి ఒక్కరు ముచ్చటగా చూసే దృశ్య కావ్యం. అలాంటి సినిమాలో మంచిర్యాల జిల్లాలోనే మారుమూల గ్రామమైన వెంచపల్లి పేరిట చిత్రీకరణ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ సైతం శరవేగంగా సాగుతోంది. సినిమా షూటింగ్‌ 70శాతం స్థానికంగా నిర్మిస్తుండగా సింగరేణి ముద్దు బిడ్డ పాలిక శ్రీనివాసచారి(పాలిక్‌) దర్శకత్వంలో మంచిర్యాలకు చెందిన శ్రీజిత్‌ లవన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పేరును ఎస్‌డీ కేరాఫ్‌ వెంచపల్లిగా నామకరణం చేశారు. రెండు నెలల్లో సినిమా షూటింగ్‌ పూర్తికానుంది. సిని పరిశ్రమను ఆకర్షించే అందాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నా నిరాదరణకు గురవుతుందని, అలాంటి అందాలను దృష్యరూపంగా మార్చినట్లు దర్శకుడు పేర్కొటున్నాడు.


                   ఆడియోను కె.విశ్వనాథ్‌తో విడుదల చేయిస్తున్న చిత్ర యూనిట్‌ 

జిల్లా వాసులకే అవకాశం..
జిల్లాలో జరుగుతున్న ఈ సినిమాలో మంచిర్యాల జిల్లా వారికే అవకాశం కల్పించారు. సినిమాలో హీరోగా శ్రీజిత్‌ లవన్, కారోణ్య కత్రినా, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్‌గా ఆదిలా బాద్‌ జిల్లాకు చెందిన ప్రేమలత, పంకజ్‌ విలన్, హీరో తండ్రిగా ప్రముఖ విలన్‌ జీవా, హీరో తమ్ముడిగా సుమన్‌శెట్టి, పంతులుగా అశోక్‌కుమార్‌లతో పాటు మంచిర్యాల జిల్లా కు చెందిన సింగ్, చంద్ర సిద్దార్థ్, శ్రీనివాస్, ప్రణవి, వెన్నెల, వంశీకృష్ణ, శ్రీశైలం, రాజేష్‌లు వివిధ పాత్రలలో నటిస్తున్నారు. 

స్థానికంగా షూటింగ్‌...
బాను ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీసాయి అమృత లక్ష్మీ క్రియేషన్‌ సమర్పణలో గోదారి భానుచందర్‌ సహకారంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మంచిర్యాలకు చెందిన పాలిక్‌ సిని పరిశ్రమలో 2002లో ప్రవేశించి దర్శకుడి స్థాయికి చేరుకున్నాడు. 1980లో జరిగిన ఒక యథార్ధ ప్రేమకథను ఈ సినిమా ద్వారా తెరపైకి ఎక్కిస్తున్నామని పేర్కొన్నారు.  వీరి ప్రేమ కథను ఎస్‌డీ కేరాఫ్‌ వెంచపల్లి సినిమాను నిర్మిస్తున్నారు. 

సిని పరిశ్రమలో రాణిస్తూ....
మంచిర్యాల జిల్లాలోనే పాత గర్మిళ్లకు చెందిన పాలిక్‌ సిని పరిశ్రమలో రాణిస్తూ జిల్లా అందాలను సిని పరిశ్రమకు పరిచయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలిసారిగా పాలిక్‌ స్టూడియోస్‌ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించిన పాలిక్‌ ప్రముఖ హీరో సుమన్‌ 100సినిమా ‘స్టడీ’ నిర్మాణం కొనసాగుతోంది. 

అదృష్టంగా భావిస్తున్న...
తెలంగాణ అందాలు తెలిపేందుకు తీస్తున్న సినిమా ఎస్‌డీ వెంచపల్లి. ఇందులో హీరోగా అవకాశం రావడం అదృష్టం. హైదరాబాద్‌లో మోడల్‌గా చేస్తున్న నేను  డైరెక్టర్‌ పాలిక్‌ను కలువగా నన్ను సినిమాలో హీరోగా ఎంపిక చేశారు. డైరెక్టర్‌ను కలిసినప్పుడు ఏమవుతుందోనని భయపడినప్పటికీ నన్ను ఈ సినిమాలో హీరోగా ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. 
 – శ్రీజిత్‌ లవన్, హీరో, మంచిర్యాల

సినిమాలో స్వామిజీలా..
ఎస్‌డీ కేరాఫ్‌ సినిమాలో నాది స్వామిజీ పాత్ర, షార్ట్‌ ఫిలింలో చేసిన అనుభవం ఉన్న నేను సినిమాలో నటించేందుకు డైరెక్టర్‌ను కలవగా నన్ను ఎంపిక చేసి సినిమాలో స్వామిజీ పాత్రను పోషించమని చెప్పారు. మన జిల్లాలో జరుగుతున్న సినిమాలో అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మారుమూల గ్రామానికి చెందిన నేను సినిమాలో నటించడాన్ని మరిచిపోలేను.
 – చంద్ర సిద్దార్థ్, దాంపూర్‌(కన్నెపల్లి)

దొర దగ్గర పనిచేసేపాత్ర
ఈ సినిమాలో దొర దగ్గర పనిచేసే పాత్ర చేస్తున్నా. ఎస్‌డీ కేరాఫ్‌ వెంచపల్లి సినిమాలో నటించేందుకు ఆర్టిస్టులు కావాలనే ప్రకటనను చూసి సినిమా డైరెక్టర్‌ను కలవడంతో ఈ అవకాశం నాకు ఇచ్చారు. మన జిల్లా వాళ్లచే, మన జిల్లాలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాతో మంచి పేరును తెచ్చుకుంటా.
– శ్రీనివాస్, ఊరు నస్పూర్‌ 

జిల్లా అందాలు తెలిపేందుకు..
మంచిర్యాల జిల్లాలో పుట్టిన నేను మన జిల్లా అందాలను తెలిపేందుకు ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ చేస్తున్నా. పూర్తిగా జిల్లాలోనే ఈ సినిమాకు పేరును కూడా జిల్లాలోని మారుమూల గ్రామమైన వెంచపల్లిని సినిమా పేరు పెట్టాను. వెంచపల్లి గ్రామంలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో భారీ వర్షాల కారణంగా మా సిని బృందం రెండు రోజులు వెంచపల్లి గ్రామంలో చిక్కుకపోతే గ్రామ యువకుడు పడాల సతీశ్, గ్రామస్తులు అందించిన సహకారాన్ని అభిమానాన్ని ఎప్పటికి మరిచిపోలేను. 
– పాలిక్, దర్శకుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top