టక్‌ జగదీష్‌

Nanis New Movie Is Tuck Jagdish - Sakshi

అతని పేరు జగదీష్, కానీ అందరూ ‘టక్‌ జగదీష్‌’ అని పిలుస్తారు. మరి ఆ పేరు వెనక స్టోరీ ఏంటి? అంటే జగదీషే చెప్పాలి. ‘నిన్ను కోరి’ సినిమా తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని మరో సినిమా కోసం కలిశారు. ఈ సినిమాకు ‘టక్‌ జగదీష్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. హరీష్‌ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది. ‘‘నా   తొలి హీరోతో మళ్లీ కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శివ నిర్వాణ. నానీతో తెరకెక్కించిన ‘నిన్ను కోరి’ దర్శకుడిగా శివ నిర్వాణకు తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న తాజా చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌. తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top