‘గ్యాంగ్‌ లీడర్‌’ సందడి మొదలవుతోంది!

Nani And Vikram K Kumar Gang Leader Pre Look - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్‌. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తికాగా త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.

ఈ నెల 15 ఫస్ట్ లుక్‌, 18న ఫస్ట్‌ సాంగ్‌, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top