ఇక మా సినిమా మాట్లాడుతుంది | Gang Leader movie success meet | Sakshi
Sakshi News home page

ఇక మా సినిమా మాట్లాడుతుంది

Sep 15 2019 3:15 AM | Updated on Sep 15 2019 3:15 AM

Gang Leader movie success meet - Sakshi

విక్రమ్, ప్రియాంక, నవీన్, నాని, కార్తికేయ, రవిశంకర్‌

‘‘నాని’స్‌ గ్యాంగ్‌లీడర్‌’ విడుదల రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్‌ అలా పైకి వెళ్లింది. శనివారం షోకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా మేం మాట్లాడాం. ఇక నుంచి మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు నాని. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించిన ‘నాని’స్‌ గ్యాంగ్‌లీడర్‌’ ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది.

ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్‌ బాగుందని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీమేకర్స్‌ బ్యానర్‌లో మరో హిట్‌ పడిందనే మెసేజ్‌ చూసి హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను చేసిన దేవ్‌ పాత్రకు ఇంతటి స్పందన రావడం నాకు ఒక కలలా ఉంది. ఈ సినిమాతో నాని నాకు  ఒక మెంటర్‌లా, ఫ్యామిలీ మెంబర్‌లా మారిపోయారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ప్రేక్షకుల అభిమానానికి థ్యాంక్స్‌’’ అన్నారు విక్రమ్‌. ‘‘మా బ్యానర్‌లో వచ్చిన మరో క్వాలిటీ ఫిల్మ్‌ ఇది. హ్యూజ్‌ బ్లాక్‌ బ్లస్టర్‌. మౌత్‌ పబ్లిసిటీ బాగుండడంతో థియేటర్స్‌ పెంచాం. నానీగారి కెరీర్‌ బెస్ట్‌ కలెక్షన్స్‌ వస్తాయని అంచనా వేస్తున్నాం’’ అన్నారు నవీన్‌.

Advertisement
 
Advertisement
Advertisement