మోక్షజ్ఞ తెరంగేట్రం ఆ సినిమాతోనే..!

Nandamuri Mokshagna To Act In Ntr Biopic - Sakshi

నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. అయితే బాలయ్య మాత్రం వారసుడ్ని పరిచయం చేసేందుకు మరింత సమయం తీసుకున్నారు. త‍్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు.

అయితే తాజాగా టాలీవుడ్‌ లో మోక్షజ్ఞ అరంగేట్రానికి సంబంధించిన వార్త హల్‌చల్‌ చేస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సమయంలో నందమూరి వారసుడ్ని పరిచయం చేసే అవకాశాన్ని మిస్‌ అయిన దర్శకుడు క్రిష్‌, ఎన్టీఆర్‌ బయోపిక్‌తో మోక్షజ్ఞను పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో మోక్షజ్ఞ, ఎన్టీఆర్‌గా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top