నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌ | Namrata Shirodkar Shares Pic From Her Modelling Days | Sakshi
Sakshi News home page

నా మరో ప్రపంచం: నమ్రత

Sep 7 2019 1:24 PM | Updated on Sep 7 2019 2:56 PM

Namrata Shirodkar Shares Pic From Her Modelling Days - Sakshi

మాజీ మిస్‌ ఇండియా, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేశ్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లతో పాటు తమ పిల్లలు గౌతం, సితారాల గురించిన విశేషాలను కూడా ఆమె అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులను అలరించే నమ్రతకు ఇన్‌స్టా ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే నటనకు విరామం ఇచ్చి ఎల్లప్పుడూ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చే నమ్రత తాజాగా తన మోడలింగ్‌ నాటి ఫొటోలను షేర్‌ చేశారు.

‘ఇతర సమయాల్లో నా మరో ప్రపంచం. నా బుక్‌లో లేని ఫొటో షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు సంగీతా రాఘవన్‌. వర్క్‌మోడ్‌’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన నమ్రత ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. వైట్‌ టాప్‌, బాటమ్స్‌లో నమ్రతతో పాటు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ మాజీ భార్య మెహర్‌ జెసియా కూడా ఈ ఫొటోలో ఉన్నారు. ఇక నమ్రత ఫొటోపై స్పందించిన అభిమానులు.. ‘ఒకనాడు నటిగా మిమ‍్మల్ని మీరు రుజువు చేసుకున్నారు. అందాల రాణిగా నిలిచారు. నేడు ఒక గృహిణిగా, తల్లిగా, వ్యాపారవేత్తగా.. అన్నింటికీ మించి మా రాజకుమారుడి మహారాణిగా మీ బాధ్యతలన్నీ చక్కగా నెరవేరుస్తున్నారు. మీరు మా అందరికీ స్పూర్తిదాయకం మేడమ్‌’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా 1993లో మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న నమ్రత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన మహేష్‌ బాబును ప్రేమించిన ఆమె.. 2005లో అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement