బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

Memes And Trolls On Bigg Boss 3 Telugu First Episode - Sakshi

కొంతమంది బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటే.. ఈ షోపై వచ్చే ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేసే ప్రత్యేకమైన బ్యాచ్‌ ఉంటుంది. ఒక్కోసారి ఎపిసోడ్‌ మిస్‌ అయినా కూడా మీమ్స్‌ను చూస్తే కంటెస్టెంట్ల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. గత సీజన్‌లోని కంటెస్టెంట్లపై వచ్చిన ట్రోలింగ్స్‌, మీమ్స్‌ ఏరేంజ్‌లో వైరల్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న అప్పటి కంటెస్టెంట్లకు వారిపై వచ్చిన ట్రోలింగ్‌, మీమ్స్‌ను ప్లే చేసి చూపిన ఎపిసోడ్‌ గుర్తుండే ఉంటుంది. ఆ మీమ్స్‌ను ఇంటిసభ్యులు కూడా తెగ ఎంజాయ్‌ చేశారు. తనీష్‌, రోల్‌రైడా, గణేష్‌లపై క్రియేట్‌ చేసిన మీమ్స్‌.. హౌస్‌లో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో వచ్చే మీమ్స్‌కు ఉండే క్రేజ్‌ అలాంటిది మరి.

ట్రోలింగ్‌, మీమ్స్‌తో నెటిజన్లును ఆకట్టుకోవడానికి సోషల్‌ మీడియాలో ఇప్పటికే చాలా పేజీలు క్రియేట్‌ అయ్యాయి. ఇక వారి ప్రతిభను చాటుకుంటూ మీమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌పై వచ్చిన మీమ్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా అషూ రెడ్డి, శ్రీ ముఖి, రవికృష్ణ, రోహిణి, జాఫర్‌, అలీ రెజాలపై వస్తోన్న మీమ్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చివరకు నాగ్‌ హోస్టింగ్‌పైనా మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. అవి కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

సోషల్‌ మీడియాలో అషూ రెడ్డిని జూనియర్‌ సమంతగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. అయితే జూనియర్‌ సమంత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అవుతుందని ఎదురుచూసిన వారికి పెద్ద షాక్‌ తగిలింది. అసలు ఆమె అషూ రెడ్డినేనా.. ఈమెను జూనియర్‌ సమంత అంటున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తుండగా.. మొదట్లో జూనియర్‌ సమంతలాగే ఉండేదని, ఇటీవలె ఆరోగ్య సమస్యల కారణంగా అలా మారిపోయిందని అషూ రెడ్డి ఫ్యాన్స్‌ సమాధానం ఇస్తున్నారు. డిఫరెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజాపై కూడా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. నిన్నటి షోలో శ్రీముఖి సోదరుడు హైలెట్‌గా నిలిచాడు. ఇతగాడిపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మీమ్స్‌ చూస్తుంటే లేడీ ఫాలోయింగ్‌ గట్టిగానే ఏర్పడిందని అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న కొన్ని మీమ్స్‌ను మీరూ చూసేయండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top