వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా..? | mega hero varuntej competing with raviteja | Sakshi
Sakshi News home page

వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా..?

Oct 2 2015 8:44 AM | Updated on Sep 3 2017 10:21 AM

వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా..?

వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా..?

మెగా అంచనాల మధ్య హీరోగా పరిచయం అయిన వరుణ్తేజ్ రెండో సినిమాతోనే రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మెగా అంచనాల మధ్య హీరోగా పరిచయం అయిన వరుణ్తేజ్ రెండో సినిమాతోనే రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ముకుంద సినిమాతో కూల్గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్, తన రెండో సినిమాగా గమ్యం ఫేమ్ క్రిష్ డైరెక్షన్లో కంచె సినిమాలో నటిస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు వరుణ్.

ఇప్పటికే షూటింగ్తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తచేసుకున్న ఈ సినిమాను గాంధీజయంతి కానుకగా రిలీజ్ చేయాలని తొలుత భావించారు. పులి, శివం లాంటి సినిమాల రిలీజ్లు ఉండటం, తరువాత వారాల్లో కూడా వరుసగా బ్రూస్ లీ, అఖిల్ సినిమాల రిలీజ్లు ఉండటంతో నవంబర్కు వాయిదా వేశారు. దీపావళి కానుకగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తన బెంగాల్ టైగర్ దీపావళి బరిలో దూకుతోందని ప్రకటించాడు మాస్ మహరాజ్ రవితేజ. కిక్ 2 ఫెయిల్యూర్తో కష్టాల్లో ఉన్న రవితేజ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి ఫాంలోకి రావాలని చూస్తుండగా, గబ్బర్సింగ్ 2 కోసం ఎదురుచూసి చాలా సమయం వృథా చేసుకున్న దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

పెద్దగా ప్రభావం చూపని విజయ్, రామ్ లతో పోటీ కాదని రవితేజతో పోటీ పడుతుండటంతో వరుణ్ కంచె ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. మరి దీపావళి బరిలో వరుణ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement