అల్లుడి సందడి

Maruthi wraps up work on Sailaja Reddy Alludu - Sakshi

ఒక్క సాంగ్‌ మినహాయించి పని మొత్తాన్ని పూర్తి చేశారు శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. రీసెంట్‌గా గుడికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో రమ్యకృష్ణ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, ‘వెన్నెల’ కిశోర్‌ పాల్గొన్నారు.

‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఒక్క పాట తప్ప మిగతా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. అనుకున్న టైమ్‌కి షూటింగ్‌ కంప్లీట్‌ చేయడానికి హెల్ప్‌ చేసిన టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాకు గోపీసుందర్‌ సంగీతం అందించారు. ఇంతకీ అల్లుడు థియేటర్లో సందడి చేసేది ఎప్పుడు అంటే.. వచ్చే ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top