మారుతికే ఓటేసిన వెంకీ | Maruthi venkatesh movie going to sets in december | Sakshi
Sakshi News home page

మారుతికే ఓటేసిన వెంకీ

Oct 31 2015 1:48 PM | Updated on Sep 3 2017 11:47 AM

మారుతికే ఓటేసిన వెంకీ

మారుతికే ఓటేసిన వెంకీ

గోపాల గోపాల సినిమా తరువాత 10 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో వెంకటేష్ త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. యంగ్ హీరోల హవా బాగా...

గోపాల గోపాల సినిమా తరువాత 10 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నసీనియర్ హీరో వెంకటేష్ త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. యంగ్ హీరోల హవా బాగా నడుస్తుండటంతో ఏ తరహా కథతో ఆడియన్స్ ముందుకు రావాలో తేల్చుకోలేక చాలా రోజులుగా కథా చర్చలతోనే కాలం గడుపుతున్నాడు వెంకీ. గతంలో మారుతి దర్శకత్వంలో రాధ పేరుతో ఓ సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు.

ఆ తరువాత మరికొంత మంది దర్శకులు వెంకటేష్కు కథలు వినిపించినా అవేవి సంతృప్తినివ్వకపోవటంతో చాలా రోజులుగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇటీవలే భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్న మారుతి తాజాగా మరో కథతో వెంకటేష్ను సంప్రదించి మెప్పించాడట. ప్రస్తుతం ఆ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు మారుతి. డిసెంబర్ నెలాఖరుకల్లా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు వెంకీ.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల కోలీవుడ్లో వరుస హిట్స్తో దూసుకుపోతున్న నయనతార గతంలో వెంకటేష్ సరసన తులసి లాంటి హిట్ సినిమాలో నటించింది. మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement