థ్రిల్లింగ్ సీన్స్తో చెలియా ట్రైలర్ 2 | mani ratnam, Karthis Cheliya Second trailer | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్ సీన్స్తో చెలియా ట్రైలర్ 2

Mar 21 2017 3:39 PM | Updated on Sep 5 2017 6:42 AM

థ్రిల్లింగ్ సీన్స్తో చెలియా ట్రైలర్ 2

థ్రిల్లింగ్ సీన్స్తో చెలియా ట్రైలర్ 2

మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చెలియా. కార్తీ సరనన అథితి రావ్ హైదరీ

మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చెలియా. కార్తీ సరనన అథితి రావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్కు రెడీ అవుతోంది. చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన మణిరత్నం, చెలియాతో ఆ ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా మణిరత్నం సినిమాలో అభిమానులు ఏ ఏ అంశాలను ఆశిస్తాడో.. ఆ అంశాలన్నింటితో చెలియాను రూపొందించాడు.

ఇప్పటి వరకు ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా మాత్రమే ప్రొమోట్ చేసిన మణిరత్నం తాజాగా రిలీజ్ చేసిన రెండో ట్రైలర్తో ట్విస్ట్ ఇచ్చాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్తో పాటు కొండ అంచుల్లో జీపు నడపడం.. హీరో శత్రువుల చేతుల్లో చిక్కుకొని చిత్రహింసలు గురికావటం. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం.. ఇలా రోజా సినిమా మరోసారి గుర్తు చేశాడు. తొలి ట్రైలర్తో ఏర్పడ్డ అంచనాలు ఈ తాజా ట్రైలర్తో రెట్టింపు అయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement