సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌ | Mahesh Babu Starting New Branded Clothing Business | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

Jul 29 2019 5:25 PM | Updated on Jul 29 2019 5:35 PM

Mahesh Babu Starting New Branded Clothing Business - Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఓ వైపు క్షణం తీరిక లేకుండా బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. మరోవైపు యాడ్స్‌ అంటూ చేతి నిండా సంపాదిస్తుండగానే.. థియేటర్‌ బిజినెస్‌లోకి దిగాడు. మళ్లీ తాజాగా ఓ క్లాత్‌ కంపెనీని ప్రారంభించబోతోన్నాడు. ఇలా బిజీబిజీగా గడిపేస్తున్న మహేష్‌ బాబు నిజంగానే బిజినెస్‌మేన్‌ అని నిరూపించుకుంటున్నాడు.

ఇప్పటికే టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ రౌడీ బ్రాండెడ్‌ దుస్తుల బిజినెస్‌ మొదలెట్టి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్‌ కూడా ఈ రంగంలో దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. హంబుల్‌కో అనే బ్రాండెడ్‌ దుస్తులను ఆగస్టు 7వ తేదీన లాంచ్‌ చేయనున్నట్లు తన అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం మహేష్‌.. ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement