చిరు సినిమాలో మహేశ్‌బాబు..! | Mahesh Babu Share Screen Space With Chiranjeevi Source Says | Sakshi
Sakshi News home page

చిరు అతిథి 

Feb 26 2020 7:28 AM | Updated on Feb 26 2020 7:33 AM

Mahesh Babu Share Screen Space With Chiranjeevi Source Says - Sakshi

ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్‌ అందించారు.

మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నారా? మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్త ఇది. మెగాస్టార్‌ చిరంజీవికి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అతిథి కాబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలోనే ఈ విశేషం జరగనుందని టాక్‌. ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్‌ అందించారు. ఒకవేళ వార్తల్లో ఉన్నట్లు చిరంజీవి సినిమాలో మహేశ్‌ నటిస్తే మొదటిసారి అతిథి పాత్రలో కనిపించినట్లు అవుతుంది.

(చదవండి : బోర్‌ కొట్టట్లేదా.. ఎప్పుడూ ఇదే పనా : మహేశ్‌)

కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... చిత్రదర్శకుడు కొరటాల శివతో ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాల్లో మహేశ్‌ నటించిన విషయం తెలిసిందే. మరి.. చిరు–కొరటాల సినిమాకి మహేశ్‌ అతిథి అవుతారా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement