ఫేవరెట్ డైరెక్టర్‌తో మరోసారి మహేష్ | Mahesh Babu Reunites With His Favourite Director Trivikram | Sakshi
Sakshi News home page

ఫేవరెట్ డైరెక్టర్‌తో మరోసారి మహేష్

Apr 11 2019 12:15 PM | Updated on Apr 11 2019 12:15 PM

Mahesh Babu Reunites With His Favourite Director Trivikram - Sakshi

ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు, షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చి ఓ యాడ్‌ ఫిలిం షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ యాడ్‌ ఫిలింకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో వహించారు. గతంలో మహేష్ హీరోగా అతడు, ఖలేజా లాంటి సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్‌ పలు యాడ్స్‌ను కూడా డైరెక్ట్ చేశాడు.

తాజాగా మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయటంపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు మహేష్. ‘నా ఫేవరెట్‌తో మరోసారి.. ఈ అనుభవం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి మే 9 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement