గుంటూరు కారం మేకింగ్‌ వీడియో రిలీజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీన్స్‌ | Guntur Kaaram Movie Making Video Released Now | Sakshi
Sakshi News home page

గుంటూరు కారం మేకింగ్‌ వీడియో రిలీజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీన్స్‌

Jan 11 2024 12:11 PM | Updated on Jan 11 2024 12:47 PM

Guntur Kaaram Movie Making Video Released Now - Sakshi

టాలీవుడ్‌  సూపర్​స్టార్ మహేశ్ ​బాబు 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం రుచి ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు మహేశ్‌.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతుంది.  ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 39 మిలియ‌న్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డుల‌కెక్కింది. 

తాజాగా గుంటూరు కారం చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను యూనిట్‌ షేర్‌ చేసింది. షూటింగ్‌ సెట్స్‌లో మహేశ్‌ ఎంతో ఫన్నీగా నవ్విస్తూ ఉన్న విజువల్స్‌ అందరినీ మెప్పిస్తాయి. రెండురోజుల క్రితం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో  గుంటూరు కారంతో ఈసారి గట్టిగా కొడతామంటూ మహేశ్‌ ప్రకటించడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.  

ప్రతి సినిమాకు తన తండ్రి ఫోన్ చేసేవారని, ఈసారి తన తండ్రి పాత్రను ప్రేక్షకులు పోషించాలని స్టేజీ మీద ఎమోషనల్‌ అయ్యాడు. ఇకపై తనకు తల్లయినా, తండ్రయినా ప్రేక్షకులే అంటూ రెండు చేతులెత్తి మొక్కాడు. దీంతో ఎప్పటికీ మహేశ్‌కు అండగా తాము ఉంటామంటూ ఫ్యాన్స్‌ కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం మేకింగ్‌ వీడియోను మీరు చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement