మహర్షి సెలబ్రేషన్స్‌

Maharshi 50 days celebrations on June 28 - Sakshi

‘మహర్షి’ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలిచిందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు మహేశ్‌బాబు. ఈ సినిమా 50 రోజులు పూర్తి కావస్తోంది. దీంతో సూపర్‌హిట్‌ సంబరాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీ దత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మించారు.

మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ సాధించిందని, 200 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ నెల 28న అర్ధశతదినోత్సవ వేడుకలను  నిర్వహించనున్నామని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల మహేశ్‌బాబు తన భార్యాపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి హాలిడే ట్రిప్‌ వెళ్లాను. ఈ ట్రిప్‌ తన తనయుడు గౌతమ్‌కి చాలా ప్రత్యేకమని మహేశ్‌ పేర్కొన్నారు. దానికి కారణం ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌ని ఈ కుటుంబం చూసింది. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ని స్వయంగా స్టేడియమ్‌లో గౌతమ్‌ చూడటం ఇదే మొదటిసారి కాబట్టి తనకిది స్పెషల్‌ ట్రిప్‌ అన్నారు మహేశ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top