‘అనుమతి లేకుండా ‘ఇండియన్‌ 2’ మొదలెట్టారు’

Lyca Internationals Files Complaint Against Producer Karunamurthy - Sakshi

నిర్మాత కరుణామూర్తిపై లైకా సంస్థ ఫిర్యాదు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా తరపున నిర్మాత కరుణామూర్తిపై రూ.110 కోట్ల మోసానికి పడినట్లు గురువారం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విజయ్‌ నటించిన కత్తి చిత్రం ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన సంస్థ లైకా. ఆ తరువాత 2.ఓ తదితర చిత్రాలను ఈ సంస్థలో నిర్మించారు. కాగా ఈ సంస్థలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న కరుణామూర్తి, ఆయన సన్నిహితుడు భాను కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ సంస్థ 2013లో చిత్ర నిర్మాణం చేపట్టిందన్నారు. అందుకు వృత్తిపరంగా ఆలోచనపరుడు అవసరం కావడంతో కె.కరుణామూర్తిని తమ సంస్థకు సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. బ్రిటీష్‌ పౌరసత్వం కలిగిన శ్రీలంక తమిళుడు, ఇండియన్‌ సినిమా నిర్మాత అయిన కరుణామూర్తి గత 27 ఏళ్లుగా అనుభవం కలిగిన వ్యక్తి అనీ, ఆయనకు ఆర్థిక పరమైన విషయాల్లో భాను అనే వ్యక్తి సహయకుడిగా ఉన్నాడని తెలిపారు. కథలను వినడం, నిర్మాణ ప్రణాళికల చేయడం, చిత్ర నిర్వహణ వంటి విషయాలకు కరుణామూర్తిని లైకా సంస్థకు నియమించినట్లు తెలిపారు.

దీంతో చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయన్నారు. నటీనటులకు పారితోషికాలు నిర్ణయించడంలోనూ ప్రధాన పాత్రను వహించారని తెలిపారు. ఆయన నిర్ణయాల మేరకే డబ్బు ఇచ్చే వారమన్నారు. అలా సినిమాల వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక లావా దేవీలు అన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నారని చెప్పారు. అలా అతని అనుచరుడు భానునే లైకా సంస్థలో కార్మికులను నియమించాడని తెలిపారు.

ఆయన చెప్పినట్లుగానే కార్మికులు వ్యహరించేలా చేసుకున్నాడని చెప్పారు. అనుమతులు లేకుండానే...ఎనక్కు ఇన్నోరు పేర్‌ ఇరుక్కు, ఎమన్‌ చిత్రాల థియేటర్ల హక్కులను, శాటిలైట్‌ హక్కులను తన ఐన్‌గరన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ తరపునే రూ. 95  కోట్లకు కరుణామూర్తి విక్రయించారన్నారు. అయితే ఇందులో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చి సంస్థను మోసం చేశారని ఆరోపించారు.

అలా మూడు చిత్రాలకు గానూ రూ.90 కోట్లకు మోసానికి పాల్పడ్డారన్నారు. అలా థియేటర్ల హక్కులు, శాటిలైట్‌ హక్కులు అంటూ తమ సంస్థకు రూ.100 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందన్నారు. కొన్నేళ్ల విచారణ తరువాత ఈ మోసాన్ని తాము గ్రహించామని తెలిపారు. ఇదే కాకుండా తమ అనుమతి లేకుండా ఒక  కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ. 25 కోట్ల నిధిని ఇచ్చారని ఆరోపించారు. అయితే ఆ డబ్బును తిరిగి ఇప్పించడం తన బాధ్యత అని చెప్పిన కరుణామూర్తి  ఇప్పటి వరకూ చర్యలు చేపట్టాలేదన్నారు. తమ అనుమతి లేకుండా  ఇండియన్‌– 2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి ఆ తరువాత నిలిపేశారని తద్వారా రూ.13 కోట్లు నష్టం కలిగిందన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top