లవ్‌ ట్వంటీ ట్వంటీ

Love 20-20 Movie Logo Launch - Sakshi

అరవింద్, మోహిని జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ 20–20’. జోశర్మ, మెక్విన్‌ గ్రూప్‌ సహకారంతో మోహన్‌ మీడియా క్రియోషన్స్‌ పతాకంపై మోహన్‌ వడ్లపట్ల, మహేంద్ర వడ్లపట్ల నిర్మిస్తున్నారు. వడ్లపట్ల సినిమాస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఈ చిత్రం లోగో లాంచ్‌ను  శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మోహన్‌ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘నాలుగు నెలల క్రితం బెంగళూరులో  చిత్రదర్శకుడు సెంథిల్‌ పరిచయమయ్యారు. ఆయన అరగంటలో నాకొక కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే ఓకే చేశాను. నటీనటులందరూ బాగా నటించారు. ఈ చిత్రకథానాయిక మోహిని 2011లో మిస్‌ టీన్‌ యూ.ఎస్‌కు పోటీ చేశారు. అలాగే 2012లో మిస్‌ టీన్‌ కెనడా, మిస్‌ టీన్‌ ఇండియా కాంటెస్ట్‌లలోనూ పాల్గొన్నారు.

సంగీతం, కెమెరా వర్క్‌ బాగా కుదిరాయి’’ అన్నారు. సెంథిల్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు నన్ను పరిచయం చేస్తున్నందుకు మోహన్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘హుషారు’ చిత్రంలో ‘ఉండిపోరాదే...’ లాంటి సూపర్‌హిట్‌ పాటను రాశాను. ఆ పాట రాయటానికి అవకాశం ఇచ్చిన బెక్కం వేణుగోపాల్‌ను నాకు పరిచయం చేసింది మోహన్‌ వడ్లపట్ల గారే. మళ్లీ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు లిరిక్‌ రైటర్‌ కిట్టు. ‘‘నేను మాట్లాడటం కంటే నా మ్యూజిక్‌ మాట్లాడితే బావుంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు సత్యన్‌. ‘‘ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్‌ చేసిన డైరెక్టర్‌గారికి కృతజ్ఞతలు. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ చిత్రంలోని పాటలు బావుంటాయి’’ అన్నారు మోహిని. దర్శక, నిర్మాత సాగర్, మహేంద్ర వడ్లపట్ల, ఎమ్‌.ఆర్‌.సి వడ్లపట్ల, నటులు క్రాంత్‌ రిసా తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top