యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ | Keerthi Suresh is Aari's pair in Krishna's rom-com | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ

Aug 28 2014 11:54 PM | Updated on Sep 18 2019 3:26 PM

యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ - Sakshi

యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ

కథలో బలం, కథనంలో పట్టు ఉంటే ఆ చిత్రం విజయం తథ్యం. అలాంటి వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా మానే తేనే పేయే చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు కృష్ణ.

కథలో బలం, కథనంలో పట్టు ఉంటే ఆ చిత్రం విజయం తథ్యం. అలాంటి వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా మానే తేనే పేయే చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు కృష్ణ. ఇంతకు ముందు సూర్య, జ్యోతిక, భూమికలతో చిల్లను ఒరు కాదల్, ఆది హీరోగా నెడుంశాలై చిత్రాలను రూపొందించిన ఈయన దర్శకత్వం వహిస్తున్న మూడవ చిత్రం మానే తేనే పేయే. కల్సన్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా సీనియర్ నటి మేనక కూతురు కీర్తి సురేష్ పరిచయం అవుతున్నారు.
 
 ఈమె ఇప్పటికే మలయాళంలో యువ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు కృష్ణ తెలుపుతూ తన తొలి చిత్రం చిల్లన్ను ఒరు కాదల్‌ను రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కించనున్నారు. రెండవ చిత్రం నెడుంశాలైకు హైవేతో తిరిగే వాహనాలపై మాటేసి దోచుకునే దొంగల ఇతివృత్తంతో రూపొందించానని తెలిపారు. తాజా చిత్రం మానే తేనే పేయేను వైవిధ్య భరిత యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరపై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. గత రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నైలో కొంత భాగం అమెరికాలో మరికొంత భాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్య పాత్రల్లో మధుమిత, సెండ్రాయన్‌లు నటిస్తున్నారని చెప్పారు. సి.సత్య సంగీతాన్ని ఎం.ఎస్.ప్రభు ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement