మెంటల్‌ రైడ్‌

కరిష్మా కపూర్‌ - Sakshi

సిల్వర్‌ స్క్రీన్‌పై కరిష్మా కపూర్‌ ఎంతటి సక్సెస్‌ఫుల్‌ హీరోయినో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై కూడా సత్తా చాటి వీక్షకుల మెప్పు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు ఎంటర్‌ అయ్యారు. ‘మెంటల్‌ హుడ్‌’ అనే వెబ్‌ సీరిస్‌లో నటిస్తున్నారు. ‘‘టైమ్‌తో సంబంధం లేకుండా రౌండ్‌ది క్లాక్‌ అమ్మకు పని ఉంటుంది. కానీ అది ఈ ప్రపంచంలోనే నా ఫేవరెట్‌ వర్క్‌. ప్రతిరోజూ కొత్త పాఠమే. ఓ సరికొత్త చాలెంజ్‌నే.

అయినా పని చేస్తూనే కొత్త విషయాలు నేర్చుకుంటుంటాం. ఈ మెంటల్‌ రైడ్‌లో నాతో పాటు జాయిన్‌ అవ్వండి ’’ అని కరిష్మా పేర్కొన్నారు. కరిష్మా కోహ్లీ దర్శకత్వంలో ఈ సిరీస్‌ను ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకునే తల్లి పాత్రలో నటించారు కరిష్మా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏడేళ్ల తర్వాత ఈ వెబ్‌ సిరీస్‌ కోసం కెమెరా ముందుకు వచ్చారు కరిష్మా. హిందీ మూవీ ‘డేంజరేస్‌ ఇష్క్‌’ (2012) తర్వాత ఆమె  మరో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top