రాందేవ్ ఆశ్రమంలో ఖాదర్ ఖాన్కు చికిత్స | 'Kadar Khan to be taken to Patanjali Yogpeeth for treatment' | Sakshi
Sakshi News home page

రాందేవ్ ఆశ్రమంలో ఖాదర్ ఖాన్కు చికిత్స

Oct 14 2015 2:15 PM | Updated on Sep 3 2017 10:57 AM

రాందేవ్ ఆశ్రమంలో ఖాదర్ ఖాన్కు చికిత్స

రాందేవ్ ఆశ్రమంలో ఖాదర్ ఖాన్కు చికిత్స

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్కు యోగా గురు రాందేవ్ బాబా పతంజలి యోగపీఠంలో చికిత్స చేయిస్తున్నారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్కు యోగా గురు రాందేవ్ బాబా పతంజలి యోగపీఠంలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం 'హో గయా దిమాగ్ కా దహీ' సినిమాలో నటిస్తున్న ఖాదర్ ఖాన్ చికిత్స బాధ్యతను సినిమా యూనిట్ తీసుకుంటుందని దర్శకుడు ఫౌజియా అర్షి తెలిపారు. ఆయన సంపూర్ణారోగ్యం పొంది, మళ్లీ షూటింగుకు రావాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. సినిమా నిర్మాత సంతోష్ భారతీయ కూడా ఖాదర్ ఖాన్ ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.

అందుకే ముంబై నుంచి హరిద్వార్లోని పతంజలి యోగపీఠానికి తీసుకెళ్లామన్నారు. ఖాదర్ ఖాన్ను బాబా రాందేవ్, ఆశ్రమంలోని ఆయుర్వేద గురువు ఆచార్య బాలకిషన్ సాదరంగా స్వాగతించారని ఫౌజియా అర్షి చెప్పారు. 'హో గయా దిమాగ్ కా దహీ' సినిమాలో ఇంకా ఓంపురి, సంజయ్ మిశ్రా తదితరులు నటిస్తున్నారు. ఇది కాక పరేష్ రావెల్, జాన్ అబ్రహం, సునీల్ శెట్టిలతో కలిసి 'హేరా ఫేరీ 3' సినిమాలో కూడా ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement