సమాజాన్ని ఆలోచింపజేస్తుంది | Janma Sthanam Movie Audio Launched | Sakshi
Sakshi News home page

సమాజాన్ని ఆలోచింపజేస్తుంది

Jun 24 2014 3:24 AM | Updated on Jul 12 2019 4:40 PM

సమాజాన్ని ఆలోచింపజేస్తుంది - Sakshi

సమాజాన్ని ఆలోచింపజేస్తుంది

‘‘ఇప్పటివరకు నేనే పాత్ర చేసినా అందులో ఏదో ఒక సందేశం ఉండటం నా అదృష్టం. ఈ చిత్రంలో కూడా నా పాత్ర మంచి సందేశం ఇస్తుంది. నాది శక్తిమంతమైన పాత్ర. సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రం ఇది’’

‘‘ఇప్పటివరకు నేనే పాత్ర చేసినా అందులో ఏదో ఒక సందేశం ఉండటం నా అదృష్టం. ఈ చిత్రంలో కూడా నా పాత్ర మంచి సందేశం ఇస్తుంది. నాది శక్తిమంతమైన పాత్ర. సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అని సాయికుమార్ చెప్పారు. ఆయన కీలక పాత్రలో ఓం సాయిప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న ‘జన్మస్థానం’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. భరత్ కలర్ ల్యాబ్ సమర్పణలో సువన్‌రాయ్ ప్రొడక్షన్ పతా కంపై కె. రాయన్న నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ స్వరాలందించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ బిగ్ సీడీని ఆవిష్కరించారు. రచయిత సుద్దాల అశోక్‌తేజ ఆడియో సీడీని ఆవిష్కరించగా, చిత్రదర్శకుడు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వందేమాతరం బాణీలు, అశోక్‌తేజ సాహిత్యం అద్భుతంగా ఉన్నాయి’’ అని చెప్పారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించామని, ఇలాంటి చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతకు ధైర్యం కావాలని దర్శకుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement