హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న ‘జాను’

Jaanu Movie First Song Out - Sakshi

శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా తొలి పాట వచ్చేసింది. ‘ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా.., గానం.. తొలి గానం పాడే వేళ‌.. తారా తీరం మ‌న దారిలోకాంతులే కురిసేలా.. చాలా దూరం రాబోవు ఉద‌యాల‌నే విసిరేలా’ అంటూ మెలోడీగా సాగిన ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకుంటుంది.

ఈ హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌ ప్రేమ‌లోని గాఢ‌తను తెలియ‌జేస్తుంది. ప్రేమికుల మధ్య ఉండే ఎమోషన్స్ ని ఎలివేట్ చేసే విధంగా లిరిక్స్‌ ఉన్నాయి. సంగీత దర్శకుడు గోవింద్ వసంత స్వరపరిచిన ఈ మెలోడీ గీతానికి శ్రీమణి లిరిక్స్‌ అందించగా.. చిన్మయి, గౌతమ్‌ భరద్వాజ్‌ ఆలపించారు. 

తమిళంలో వచ్చిన ‘96’కు రీమేక్‌గా ‘.జాను’  చిత్రం రూపొందుతున్న సంగతి తెసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృదం ప్రయత్నిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top