
నేను మోసగాడిని కాదు: హీరో
బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ నాలుగో సినిమా 'మైఖేల్ మున్నా' షూటింగ్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది.
ముంబై: బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ నాలుగో సినిమా 'మైఖేల్ మున్నా' షూటింగ్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. టైగర్ ష్రాఫ్, సబీర్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం తన కథను దొంగిలించారని కృతిక్ కుమార్ పాండే అనే రచయిత పోలీసు కేసు పెట్టారు. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ వీరాభిమాని కథతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నానని, దీన్ని టైగర్ ష్రాఫ్ ను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను రాసిన కథను అతడికి వినిపించానని వెల్లడించాడు. పాండే ఆరోపణలను టైగర్ ష్రాఫ్ తోసిపుచ్చాడు.
'ఈ విషయం గురించి నాకు తెలియదు. మేము ఇక్కడే ఉన్నాం. ఎలాంటి చోరీకి పాల్పడలేదు. నేను దొంగను కాదు. నేను అబద్ధాలు ఆడను. నేను మోసగాడిని కాద'ని విలేకరులతో టైగర్ ష్రాఫ్ అన్నాడు. 'ఎ ఫ్లెయింగ్ జాట్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చాడు. 'ఎ ఫ్లెయింగ్ జాట్' సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది.