నువ్వు అద్భుతమైన నటివి: హృతిక్‌ | Hrithik Roshan Wishes War Co-Star Vaani Kapoor On Her Birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే వాణీ: హృతిక్‌

Aug 23 2019 6:19 PM | Updated on Aug 23 2019 6:34 PM

Hrithik Roshan Wishes War Co-Star Vaani Kapoor On Her Birthday - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తన కో స్టార్‌ వాణి కపూర్‌ అద్భుతమై నటి అంటూ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు కలిసి వార్‌ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వాణి కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా హృతిక్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ హే వాణి నీ బర్త్‌  డే సందర్భంగా నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వ అద్భతమైన నటివి! ఈ సంవత్సరం నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక బాలీవుడ్‌ భామ అభిమానుల కోసం తన బర్త్‌డేకు ముందు రోజు మంచు కొండల వద్ద తీసుకున్న అందమైన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘కాళ్లు భూమి మీదే ఉన్నా.. తల మేఘాలను తాకుతూ... హృదయం గాల్లో తేలుతోంది’ అనే క్యాప్షన్‌ వాటికి జత చేశారు.

కాగా వాణీ కపూర్‌.. సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌, పరిణితి చోప్రా జంటగా తెరకెక్కిన ‘శుద్ద్‌ దేశీ రొమాన్స్‌’ సినిమాతో  బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆహా కళ్యాణం మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించారు. ఇక రణ్‌వీర్‌ సింగ్‌తో బేఫికరేలో  నటించిన వాణి  తాజాగా హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు కలిసి నటిస్తున్న ‘వార్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement