‘నేను పోలీస్‌ కాదు పోకిరి’

Hero Vikram Director Hari Saamy Trailer - Sakshi

మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి, విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్‌లో పదిహేనేళ్ల క్రితం ఘనవిజయం సాధించిన సినిమా సామి. ఇన్నేళ్ల తరువాత అదే కాంబినేషన్‌లో సామి సినిమాకు సీక్వెల్‌ను రూపొందించారు. తమిళ్‌లో సామి 2 పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాను తెలుగులో ‘సామి’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. విక్రమ్‌ను మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో చూపించాడు దర్శకుడు హరి. శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్.

దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. అవుట్ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో విక్రమ్‌ తిరిగి ఫాంలోకి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. హరి మార్క్‌ స్పీడ్‌తో విక్రమ్‌ స్టైల్స్‌ తో రూపొందించిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top