మరోసారి వార్తల్లో నిలిచిన హన్సిక! | Hansika Says Her Social Media Accounts Are Hacked | Sakshi
Sakshi News home page

Jan 25 2019 6:57 AM | Updated on Jan 25 2019 6:57 AM

Hansika Says Her Social Media Accounts Are Hacked - Sakshi

తమిళసినిమా: ముంబై బ్యూటీ హన్సిక మరోసారి వార్తల్లో నానుతోంది. ఆ మధ్య తాను సెంట్రిక్‌ పాత్రలో నటిస్తున్న మహా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో వివాదాస్పద ఫొటోలతో విడుదల కావడంతో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అమ్మడు సామాజిక మాధ్యమాలకు పని చెప్పింది. ఇటీవల విదేశాల్లో జాలీగా ఎంజాయ్‌ చేసొచ్చిన విషయం తెలిసిందే. అలా మియామిలోని సముద్ర తీరంలో తీసుకున్న గ్లామరస్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుండడంతో హన్సికపై విమర్శల దాడి మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటి నుంచి బయట పడడానికో, లేక నిజంగానే జరిగిందో తెలియదు గానీ, తన ఫోన్‌ను, ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని హన్సిక తెలిపింది.

దీనికి సంబంధించిన చర్చ ఆగక ముందే హన్సిక మరో సంఘటనను ఎదుర్కొంది. ఈమె నటిస్తున్న 50వ చిత్రం మహా అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాల్లో నటిస్తుండగా బుధవారం హన్సిక గాయాలపాలైందట. ఈ విషయాన్ని ఆమె వర్గాలు వెల్లడించారు. మహా చిత్రం కోసం పల్టీ కొట్టే సన్నివేశంలో నటిస్తుండగా కాలికి చిన్న గాయం అయ్యిందట. అయితే ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ ఆ పోరాట దృశ్యాల్లో హన్సిక పాల్గొందని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఇలా రెండు మూడు రోజులుగా ఈ అమ్మడు వార్తలో నానుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement