పవర్‌ఫుల్‌ పంతం | Gopichand's Pantham First Look | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ పంతం

Mar 22 2018 12:13 AM | Updated on Mar 22 2018 12:13 AM

Gopichand's Pantham First Look - Sakshi

గోపీచంద్

‘బలుపు, పవర్, జై లవకుÔè ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు స్క్రీన్‌ప్లే ఇచ్చిన  కె.చక్రవర్తి దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘పంతం’. ‘ఫర్‌ ఎ కాస్‌’ అన్నది ఉప శీర్షిక. గోపీచంద్, మెహరీన్‌ జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా చేయడం హ్యాపీగా ఉంది.

మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ హంగులతో చక్రి సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్‌గారి క్యారెక్టర్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ కనపడని స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారాయన.  60 శాతం చిత్రీకరణ పూర్తయింది. గోపీ సుందర్‌ సంగీతం, ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, బాబీ (కె.ఎస్‌.రవీంద్ర).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement