పంతం... చెడు అంతం | Gopichand 25th movie title is 'Pantham' | Sakshi
Sakshi News home page

పంతం... చెడు అంతం

Feb 5 2018 1:58 AM | Updated on Feb 5 2018 1:58 AM

Gopichand 25th movie title is 'Pantham' - Sakshi

గోపీచంద్

ఎవరూ ఊరికే పంతం పట్టరు. ఏదైనా సొంతం చేసుకోవాలనో లేక ఎవర్నైనా అంతం చేయాలనో... పంతం పట్టడానికి ఇలా ఏదో ఒక కారణం ఉంటుంది. విలన్‌ పంతం అతని పతనానికి కారణమవుతుంది. హీరో పంతం ఇతరుల మంచి కోసం ఉపయోగపడుతుంది. గోపీచంద్‌ ఓ మంచి పని కోసం పంతం పట్టారు. అదేంటో స్క్రీన్‌పైనే చూడాలంటున్నారు నిర్మాత కేకే రాధామోహన్‌. గోపీచంద్, మెహరీన్‌ జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై చక్రి దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న సినిమాకు ‘పంతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

‘ఫర్‌ ఏ కాజ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను మే 18న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘గోపీచంద్‌గారు మా బ్యానర్‌లో 25వ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ప్లాన్‌ చేసుకున్న ప్రకారం ఇప్పటికే ఒక పాట, కొంత టాకీ పార్ట్‌ను కంప్లీట్‌ చేశాం. ప్రస్తుతం ఇంటర్‌వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. కమర్షియల్‌ హంగులు జోడించి మంచి మేసేజ్‌తో దర్శకుడు చక్రి సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు ’’ అన్నారు నిర్మాత కేకే రాధామోహన్‌. పృథ్వీ, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement