తమాషా చేయనున్న శ్రీ | Ee Rojullo fame Sri is doing 'tamasa' | Sakshi
Sakshi News home page

తమాషా చేయనున్న శ్రీ

Oct 24 2013 1:24 AM | Updated on Sep 1 2017 11:54 PM

తమాషా చేయనున్న శ్రీ

తమాషా చేయనున్న శ్రీ

రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను అలరించేలా కావల్సినంత వినోదం ఇవ్వడానికి శ్రీ జ్యోతిప్రసన్న మూవీస్ సంస్థ ‘తమాషా’

రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను అలరించేలా కావల్సినంత వినోదం ఇవ్వడానికి శ్రీ జ్యోతిప్రసన్న మూవీస్ సంస్థ ‘తమాషా’ అనే చిత్రం నిర్మించనుంది. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ హీరోగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో యం. విజయవర్ధనరావు, శివారెడ్డి నీలపు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెల 9న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మలయాళ దర్శకుడు సిద్ధిక్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశారు శ్రీనివాస్ బల్లా. టైటిల్‌కి తగ్గట్టే ఈ చిత్రం వినోద ప్రధానంగా ఉంటుంది’’ అని చెప్పారు. మాధురి ఇటాగి, సునీత మార్షియా హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ఎమ్మెస్ నారాయణ, సయాజీ షిండే, రవిప్రకాష్, ప్రవీణ్, దువ్వాసి మోహస్ తదితరులు ఇతర పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రషీద్ మూపెన్, సంగీతం: రఘురామ్, నిర్వహణ: ముకుందరావు.
 

Advertisement

పోల్

Advertisement