breaking news
Srinivas Balla
-
తమషాగా ఉంటుందట
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, నీలం ఉపాధ్యాయ, సునీత మార్షియా ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమాషా’. ఎం.విజయవర్దన్‌రావు, శివారెడ్డి నీలపు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణ గోగుల కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ అడ్డాల క్లాప్ ఇచ్చారు. అనిల్‌కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీనివాస్ బల్లా అద్భుతమైన కథ తయారు చేశారు. మలయాళ దర్శకుడు సిద్దిక్ శిష్యుడైన శ్రీనివాస్ ఈ చిత్రాన్ని జనరంజకంగా తీస్తారనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు. నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని దర్శకుడు చెప్పారు. మంచి నిర్మాతలు దొరికితేనే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని, అనుకున్నట్లే మంచి నిర్మాతలు దొరికారని శ్రీ అన్నారు. సంగీతానికి మంచి ఆస్కారం ఉన్న సినిమా ఇదని సంగీత దర్శకుడు రఘురాం అన్నారు. సయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, రవిప్రకాష్, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జి.సందీప్, సంగీతం: రఘురామ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.రావు, నిర్మాణ సారథ్యం: ఎస్.ముకుందరావు. -
తమాషా చేయనున్న శ్రీ
రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను అలరించేలా కావల్సినంత వినోదం ఇవ్వడానికి శ్రీ జ్యోతిప్రసన్న మూవీస్ సంస్థ ‘తమాషా’ అనే చిత్రం నిర్మించనుంది. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ హీరోగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో యం. విజయవర్ధనరావు, శివారెడ్డి నీలపు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెల 9న ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మలయాళ దర్శకుడు సిద్ధిక్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశారు శ్రీనివాస్ బల్లా. టైటిల్‌కి తగ్గట్టే ఈ చిత్రం వినోద ప్రధానంగా ఉంటుంది’’ అని చెప్పారు. మాధురి ఇటాగి, సునీత మార్షియా హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ఎమ్మెస్ నారాయణ, సయాజీ షిండే, రవిప్రకాష్, ప్రవీణ్, దువ్వాసి మోహస్ తదితరులు ఇతర పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రషీద్ మూపెన్, సంగీతం: రఘురామ్, నిర్వహణ: ముకుందరావు.