'దుస్తులపై కాదు.. నటనపై దృష్టి పెట్టండి' | Don't focus on clothes, focus on acting, Shah Rukh Khan tells strugglers | Sakshi
Sakshi News home page

'దుస్తులపై కాదు.. నటనపై దృష్టి పెట్టండి'

Nov 4 2014 10:48 PM | Updated on Apr 3 2019 6:23 PM

'దుస్తులపై కాదు.. నటనపై దృష్టి పెట్టండి' - Sakshi

'దుస్తులపై కాదు.. నటనపై దృష్టి పెట్టండి'

సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులకు గురవుతున్న నటులకు సలహాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ బాద్ షా షారుక్ స్పష్టం చేశాడు.

ముంబై: సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులకు గురవుతున్న నటులకు సలహాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ బాద్ షా షారుక్ స్పష్టం చేశాడు. ఎవరైనా నటనతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సూచనలు అవసరమన్న షారుక్.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ' మనం ముందు చేసే పనిపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా నటులు నటననే సర్వస్వంగా భావించాలి' అని షారుక్ అభిప్రాయపడ్డాడు. సినిమా జీవితం ప్రారంభించిన కొద్ది కాలంలోనే సూపర్ స్టార్ హోదాను అందుకున్న షారుక్.. సరైన ప్రణాళికలు లేకుండా ఎవరూ నటులు కాలేరన్నాడు.

 

దుస్తులపైనా, మేకప్ పైనా దృష్టి పెట్టకుండా.. నటనపై మాత్రమే ఏకాగ్రత చూపాలని నటులకు హితవు పలికాడు. ప్రజా జీవితంలో వారికుండే పోర్ట్ ఫోలియో కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement