ఆమెను ప్రేమిస్తున్నాను.. కానీ! | Disha and I are good friends, says Tiger Shroff | Sakshi
Sakshi News home page

ఆమెను ప్రేమిస్తున్నాను.. కానీ!

Jun 29 2016 12:02 AM | Updated on Apr 3 2019 6:34 PM

ఆమెను ప్రేమిస్తున్నాను.. కానీ! - Sakshi

ఆమెను ప్రేమిస్తున్నాను.. కానీ!

జాకీష్రాఫ్ వారసుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు టైగర్ ష్రాఫ్. తక్కువ కాలంలోనే తనకంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు టైగర్.

ముంబై: జాకీష్రాఫ్ వారసుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు టైగర్ ష్రాఫ్. తక్కువ కాలంలోనే తనకంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు టైగర్. 'బాగీ'తో మంచి హిట్ కొట్టిన టైగర్.. సినిమాల కంటే ఎఫైర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. హీరోయిన్ దిశా పటానీతో ఎక్కువగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు టైగర్. టాలీవుడ్ మూవీ లోఫర్ ఫేమ్ దిశాపటానీ, టైగర్ ష్రాఫ్ ప్రేమపక్షుల్లా విహరిస్తున్నా... తమపై వచ్చినవి కేవలం వదంతులేనని, వాటిలో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. తమ మధ్య ఉన్న రిలేషన్ ను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ జంట అంటోంది. శ్రద్ధాకపూర్ తోనే టైగర్ చాలా క్లోజ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే.


దిశాపటానీని ప్రేమిస్తున్నానని, అయితే స్నేహితురాలిగా మాత్రమేనని..  ప్రేయసిగా కాదని పేర్కొన్నాడు. బేఫికర్ లో ఓ సాంగ్ లాంచ్ చేసిన సందర్భంగా వారిపై వస్తున్న వదంతులపై వీరు నోరు విప్పారు. 'స్క్రీన్ మీద మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మేమిద్దరం మంచి స్నేహితులం. కలిసి గేమ్స్ ఆడతాం. డ్యాన్స్ కూడా చేస్తుంటాం. ఒకరినొకరం చాలా అర్థం చేసుకున్నాం. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి అలా బయట విహరిస్తుంటాం. కలిసి సినిమాలు చేయడమే కాదు డిన్నర్స్ కూడా చేస్తుంటాం. అందుకే మేం ఇద్దరం ఒకేచోట ఉంటే చాలా సౌకర్యంగా ఫీలవుతామని' అని దిశా, టైగర్ తమ రిలేషన్ పై స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement