ఎయిడ్స్ కథలో... | Director Priyadharshan to direct a film on AIDS? | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్ కథలో...

Jul 10 2015 11:50 PM | Updated on Mar 28 2019 8:28 PM

ఎయిడ్స్ కథలో... - Sakshi

ఎయిడ్స్ కథలో...

జాతీయ అవార్డులు సాధించిన తమిళ చిత్రం ‘కాంజీవరమ్’ దర్శకుడు ప్రియదర్శన్, హీరో ప్రకాశ్‌రాజ్ మరోసారి కలసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

జాతీయ అవార్డులు సాధించిన తమిళ చిత్రం ‘కాంజీవరమ్’ దర్శకుడు ప్రియదర్శన్, హీరో ప్రకాశ్‌రాజ్ మరోసారి కలసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ‘కాంజీవరమ్’లో ప్రకాశ్ రాజ్ సరసన నటించిన శ్రీయారెడ్డే ఈ కొత్త చిత్రంలోనూ నాయిక. గతంలో ‘అప్పుడప్పుడు’, ‘పొగరు’ చిత్రాలతో వైవిధ్యమైన  నటిగా పేరు తెచ్చుకున్న ఆమె పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె చేసిన తొలి చిత్రం ‘కాంజీవరమ్’. ఈ కొత్త చిత్రం ఎయిడ్స్ వ్యాధి నేపథ్యంలో సాగుతుంది.

శ్రీయారెడ్డి మలి చిత్రం కూడా ప్రియదర్శన్ దర్శకత్వంలో కావడం, కమర్షియల్ ఫార్మెట్‌లో సాగే ప్రయోజనాత్మక చిత్రం కావడం, తన పాత్ర కూడా బాగుండడం వల్ల ఈ చిత్రాన్ని పచ్చజెండా ఊపారామె. ‘‘ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. అందరి జీవితాలకు కనెక్ట్ అయ్యేలా, మానవీయ కోణాలను స్పృశించే కథ. ‘కాంజీవరమ్’కి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాగా పేరు వచ్చింది గానీ సామాన్య ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ ఈ సినిమా ‘కాంజీవరమ్’ స్థాయిలో ఉంటూనే, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని శ్రీయారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement