కొన్ని రోజులు డిజార్డర్స్‌కి బ్రేక్‌

director maruthi interview about sailaja reddy alludu - Sakshi

‘‘ఈ మధ్య అన్నీ డిజార్డర్స్‌ (హీరో క్యారెక్టర్‌కి లోపం) తోనే సినిమాలు చేస్తున్నాం అని అంటున్నారు. ఈ సినిమాలో ఏ డిజార్డర్‌ ఉండదు. కొన్ని రోజులు డిజార్డర్స్‌కి బ్రేక్‌ ఇద్దాం అనుకుంటున్నాను.  ఫ్యామిలీ అంతా ఎంజాయ్‌ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీశాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పీడివీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు.
► ముందుగా ఈ సినిమాను ఆగస్ట్‌ 31న రిలీజ్‌ చేద్దాం అనుకున్నాం. కానీ కేరళ వరదల కారణంగా కుదర్లేదు. సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ చుట్టాలు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ఈ సినిమాను వాయిదా వేసేశాం.  

► ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ చూడగానే ఈ సినిమా అత్తా అల్లుడి మధ్య సవాల్‌ అని ఊహించేసుకుంటారు. కానీ ఇది అత్తా అల్లుడే కాదు వాళ్ల అమ్మాయితో కూడా ఈగో సమస్యల్లో ఇరుకుంటాడు హీరో. సాధారణ మనిషి శైలజా రెడ్డి అల్లుడు ఎలా అయ్యాడని కథ. ఈగోయిస్ట్‌ మనుషులతో హీరో ఎలా నలిగిపోతాడన్నది మరో కోణం. హీరోకి చాలా సహనం కావాలి. రియల్‌గా కూడా చైతూకి ఓపిక ఎక్కువ. పాజిటివ్‌ పర్సన్‌.

► ఫస్ట్‌ యూత్‌ఫుల్‌ స్టోరీ (‘ఈ రోజుల్లో’),  హారర్‌ కామెడీ (ప్రేమకథా చిత్రమ్‌), ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ (‘భలే భలే మగాడివోయ్‌’) తీశాం. ఇప్పుడు ఫుల్‌లెంగ్త్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ మూవీ  చేశాను. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్‌ టచ్‌ చేస్తే మనం ఇంప్రూవ్‌ అవుతాం.

► ఎప్పుడూ అత్తలంటే చెడ్డవాళ్లే అనుకుంటాం. కానీ ఇందులో అలా కాదు. చైతూ చాలా కొత్తగా ఉంటాడు.  రమ్యకృష్ణగారి పాత్రకు కూడా కథలో  ఇంపార్టెన్స్‌ ఉంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం.

► ‘అల్లరి అల్లుడు’లాంటి పాత టైటిల్స్‌ పెడదాం అనుకున్నాం కానీ విరమించుకున్నాం. ఇందులో టైటిలే కొంచెం పాతగా ఉంటుంది. సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది. చైతూ కూడా క£ý లో భాగం అవుతాడు. మొత్తం నా మీదే నడవాలని అనుకోడు.  ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కూడా నాగార్జునగారి  ఫ్యామిలీ చేస్తున్న సినిమాల దృష్టిలో పెట్టుకొని కథను అనుకున్నాను.

► అనూ ఇమ్మాన్యుయేల్‌ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా లవ్‌స్టోరీ, సెకండ్‌ హాఫ్‌ అంతా ఫుల్‌ ఫ్యామిలీ సీన్స్‌ ఉంటాయి. ప్రొడ్యూసర్స్‌ నాగ వంశీ, ప్రసాద్‌గార్లు రిచ్‌గా సినిమాని తీశారు. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా రిచ్‌గా ఉంటుంది.

► కొన్నిసార్లు మనం అనుకున్న ఐడియాకు వేరే దర్శకుడు కనెక్ట్‌ కాకపోవచ్చు. వీళ్లు చేయగలరు అని నాకు నమ్మకం కుదిరితే వేరే డైరెక్టర్స్‌తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి చిన్న సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ సినిమాకైనా అదే హార్డ్‌ వర్క్‌ ఉంటుంది. పెద్ద సినిమాకు ఓ నెల శ్రమ ఉంటుంది. చిన్న సినిమాను హిట్‌ చేయడం గ్రేట్‌. కొత్తవాళ్ల పోస్టర్స్‌తో ఆడియన్స్‌ను థియేటర్‌కి తీసుకురావడం గ్రేట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top