దిలీప్ కుమార్ క్షేమం: వదంతులు నమ్మొద్దు | Dilip Kumar is fine: | Sakshi
Sakshi News home page

దిలీప్ కుమార్ క్షేమం: వదంతులు నమ్మొద్దు

Sep 19 2013 1:36 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరణించారంటూ వదంతులు వెలువడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దిలీప్ కుమార్ స్నేహితుడు ఉదయ తారానాయర్ వెంటనే స్పందించి దిలీప్ క్షేమంగా ఉన్నారని చెప్పారు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం పుకార్లు షికార్లు చేశాయి. ఆయన మరణించారంటూ వదంతులు వెలువడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఐతే దిలీప్ కుమార్ స్నేహితుడు ఉదయ తారానాయర్ వెంటనే స్పందించి దిలీప్ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారాలను మానుకోవాలని సూచించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, వందతుల్ని నమ్మవద్దని అభిమానులను కోరారు.

ఆదివారం 90 ఏళ్ల దిలీప్ కుమార్ అస్వస్థతకు గురవ్వడంతో ముంబై లీలావతి ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 'దిలీప్ ఇంకా ఐసీయూలోనే ఉన్నా ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. ఆయన క్షేమంగా ఉన్నారు" అని నాయర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement