18 ఏళ్ల తర్వాత బాలీవుడ్ హీరోకు విముక్తి | Dilip Kumar acquitted in 18-year-old cheque bounce case | Sakshi
Sakshi News home page

18 ఏళ్ల తర్వాత బాలీవుడ్ హీరోకు విముక్తి

Feb 23 2016 3:32 PM | Updated on Apr 3 2019 6:23 PM

18 ఏళ్ల తర్వాత బాలీవుడ్ హీరోకు విముక్తి - Sakshi

18 ఏళ్ల తర్వాత బాలీవుడ్ హీరోకు విముక్తి

బాలీవుడ్ దిగ్గజ నటుడు హీరో దిలీప్ కుమార్ (94)కు 18 ఏళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో విముక్తి లభించింది.

ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు హీరో దిలీప్ కుమార్ (94)కు 18 ఏళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో విముక్తి లభించింది. మంగళవారం ముంబై కోర్టు దిలీప్కుమార్ను నిర్దోషిగా ప్రకటించింది. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. దీంతో ఈ రోజు దిలీప్ కుమార్ కోర్టుకు హాజరుకాలేదు.

1998లో దిలీప్ కుమార్పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన జీకే ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి గౌరవ చైర్మన్గా ఉన్నారు. ఎగుమతి వ్యాపారం చేసే ఈ కంపెనీ ఇచ్చిన చెక్లు బౌన్స్ కావడంతో బాధితులు కేసు పెట్టారు. కంపెనీ నిర్వాహకులతో పాటు దిలీప్ కుమార్పై కూడా ఫిర్యాదు చేశారు. కంపెనీ కార్యకలాపాల్లో దిలీప్ కుమార్కు నేరుగా ప్రమేయంలేదని, చెక్ బౌన్స్ కేసులో ఆయన పాత్రలేదని న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం సాగింది. ఈ రోజు కోర్టు దిలీప్ కుమార్ను నిర్దోషిగా ప్రకటించినట్టు ఆయన భార్య సైరా భాను ట్విట్టర్లో తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement