దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ సోదాలు | Dil Raju about Maharshi Extra Shows and Tickets Rate Hike | Sakshi
Sakshi News home page

దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ సోదాలు

May 8 2019 12:32 PM | Updated on May 8 2019 1:25 PM

Dil Raju about Maharshi Extra Shows and Tickets Rate Hike - Sakshi

మహర్షి సినిమాకు తెలంగాణలో ఎక్స్‌ట్రా షోస్‌కు అనుమతిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్‌ సినిమా కావటంతో ఎక్స్‌ట్రా షోస్‌ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతించాల్సిందిగా కోరామని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. అదే సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు కోర్టు అనుమతించినట్టుగా తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పేసింది.
(చదవండి : ‘మహర్షి’ పర్మిషన్ల రగడ)

తాజాగా దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోధాలు చేశారు. రేపు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్లపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే పలు భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. 

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు మరోసారి స్టైలిష్ విలస్‌గా అలరించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement