దటీజ్‌ దీపికా!

deepika padukone return to remuneration - Sakshi

ఇర్ఫాన్‌ ఖాన్, దీపికా పదుకోన్‌ ముఖ్య పాత్రల్లో  దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాను ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్‌ ఖాన్‌ ఆరోగ్య స్థితి బాగుండి ఉంటే ఈ సినిమా అనుకున్న సమయానికి పట్టాలెక్కేది. అయితే కేన్సర్‌ చికిత్స కోసం లండన్‌లో ఉన్న ఇర్ఫాన్‌ ఎప్పుడు కోలుకొని తిరిగి వస్తారన్న విషయంలో స్పష్టత లేదు. దాంతో ఈ సినిమా నుంచి దీపికా తప్పుకున్నారట. అయితే తీసుకున్న అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేశారట.

జనరల్‌గా కొందరు తారలు ఒక్కసారి అడ్వాన్స్‌ తీసుకుంటే వెనక్కి ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. కానీ దీపికా మాత్రం న్యాయంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. నవంబర్‌లో రణ్‌వీర్‌ సింగ్‌తో దీపిక పెళ్లి జరగనుందట. అందుకే షూటింగ్స్‌తో బిజీ కాకూడదని ఆమె అనుకుంటున్నారని సమాచారం. కానీ ఇర్ఫాన్‌ ఖాన్‌ ఎప్పుడు తిరిగొచ్చినా ఈ సినిమా చేస్తానని విశాల్‌ భరద్వాజ్‌కి మాట ఇచ్చారట. వృత్తి పట్ల ఇంత ప్రొఫెషనల్‌గా ఉన్న ఈ బ్యూటీని దటీజ్‌ దీపికా అనకుండా ఉండలేం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top