అంతకు మించి... | Dandupalyam 3 Movie | Sakshi
Sakshi News home page

అంతకు మించి...

Feb 9 2018 1:43 AM | Updated on Feb 9 2018 1:43 AM

Dandupalyam 3 Movie - Sakshi

పూజగాంధీ

విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘దండుపాళ్యం’. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో  శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం 2’ వచ్చింది. ఆ రెంటినీ మించేలా ‘దండుపాళ్యం 3’ రాబోతోంది.

ఈ చిత్రం తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసు కున్న శ్రీనివాస్‌ మీసాల, రజని తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరాజు కథ, కథనం, సన్నివేశాలు మెస్మరైజ్‌ చేస్తాయి. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘దండుపాళ్యం’ సిరిస్‌కి ఇదే చివరి పార్ట్‌ కావటంతో క్లైమాక్స్‌ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. త్వరలోనే ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తాం. మార్చి 2న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర ్పణ: సాయికృష్ణ ఫిల్మ్స్, సంగీతం: అర్జున్‌ జన్యా, కెమెరా: వెంకట్‌ ప్రసాద్, సహ నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement