జైలు నుంచి తప్పించారా? | My role will be appreciated | Sakshi
Sakshi News home page

జైలు నుంచి తప్పించారా?

Jul 2 2018 12:35 AM | Updated on Jul 2 2018 12:35 AM

My role will be appreciated - Sakshi

బెనర్జీ

సుమారంగనాధన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం–4’. కె.టి.నాయక్‌ దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో దండును తయారు చేసే నాయకుడిగా ముఖ్య పాత్రలో నటుడు బెనర్జీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘నటుడిగా నాకిది వైవిధ్యమైన పాత్ర. నా పాత్రతో సహా  మా దండు చేసే పోరాటాలు, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రంలోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి.

నా పాత్ర ప్రశంసలు అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఏడుమంది గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్‌ నటిస్తున్నారు. 40 మంది గ్యాంగ్‌లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథక రచనతోనే ఈ సినిమా రూపొందింది’’ అన్నారు కె.టి.నాయక్‌. ‘‘ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం’’ అన్నారు వెంకట్‌. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.గిరి, సంగీతం: ఆనంద్‌ రాజావిక్రమ్,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement